చండీ హోమము ఎందుకు చేయాలి ?_* _అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే ! చండీమాత ఓ ప్రచంఢ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగటానికి, అది వృద్ధి చెందటానికి , తిరిగి లయం కావటానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి , పరాశక్తి, జ్ఞానశక్తి , ఇచ్ఛాశక్తి , క్రియాశక్తి , కుండలినీశక్తి ! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం._ _లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాలలో చండి ఒకటి. లోక కళ్యాణం కోసం , విశేష కార్యసిద్ధి కోసం , సకల చరాచర జగత్తు సృష్టికి , స్థితికి , లయకు మూలకారణమైన జగన్మాతను ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆది తత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య_ _అది లలితా పారాయణం , చండీ పారాయణం అని రెండురకాలు . బ్రహ్మాండపురాణం , దేవీభాగవతం లలితా దేవి మహిమలను చెబితే , మార్కండేయ పురణ చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించటంతోపాటు బ్రహ్మాదిదేవతలు ఆమే వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి._ *_చండీహోమంలో ఉన్న మంత్రాలు & అద్యాయాలు:_* _చండీ సప్తసతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. ఐతే ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు , అర్ధశ్లోక , త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలు ఐనాయి. బ్రాహ్మీ , నందజ , రక్తదంతిక , శాకాంబరీ , దుర్గ , భీమ , భ్రామరి అనే ఏడుగురు దేవతా మూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్మ్యా వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టీ దీనికి చండీ సప్తశతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనుక నిష్ఠగా చేయవలసి ఉంటుంది._ _దుర్గా లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా , 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకేఒక అధ్యాయం ఉంటుంది. రెండవ భాగంలో మూడు అధ్యాయాలు , మూడవ భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన , మహిషాసుర సంహారం శుంభనిశుభుల వధతో పాటు బ్రహ్మాదిదేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతి ని మూడు పద్ధతులలో ఆచరిస్తారు. పూజ , పారాయణ , హోమం . ఈ మూడుపద్దతులలో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం , దశాంశం తర్పణ ఇస్తారు. చండీ హోమానికి సంబందించి నవ చండీ యాగం , శత చండీ యాగం , సహస్ర చండీ యాగం , అయుత ( పది వేలు ) , చండీయాగం , నియుత ( లక్ష ) చండీయాగం , ప్రయుత ( పది లక్షలు ) చండీయాగం ఉంటాయి._ _2. చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు :_ _ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖమనేది రాదు . ఆ ప్రాంతంలో అకాల మరణాలుండవు. లోక కళ్యాణం , సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి ఐన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘటిస్తోంది._ _కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తి వంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్ర వచనం. ఇహపర సాధనకు_ _చండీహోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి , హోమం నిర్వహించటమే చండీహోమం. దేశోపద్రవాలు శాంతించటానికి , గ్రహాల అనుకూలతలకు ,_ _భయభీతులు పోవటానికి , శత్రు సంహారానికి , శత్రువులపై విజయం సాధించటానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు._ _వీటిలో_ _నవ చండీయాగం చేస్తే వాజపేయం చేసినంతఫలం వస్తుందట_. _ఏకాదశి చండీ చేస్తే రాజు వశమౌతాడని ,_ _ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని ,_ _మను చండీ ( చతుర్దశ చండీ ) తో శత్రువు మౌతాడని మార్కండేయపురాణం చెప్పినట్లు , శాంతి కమలాకరంలో ఉన్నది._ _ఇక_ _శత చండీ చేస్తే కష్టాలు , వైద్యానికి లొంగని అనారోగ్యం , ధన నష్టం తదితరాలు తొలగుతాయి_ . _సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరుతాయి._ _లక్ష చండీ చేస్తే చక్రవర్తి ఔతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండీ అంటారు._ _ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు_ _________________________ * - : *వాగ్దేవతలు* : - *తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :* "అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం. "క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు. "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి. సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం. "చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని" అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది. "ట" నుండి "ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల". అంటే మలినాలను తొలగించే దేవత. "త" నుండి "న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ" కరుణను మేలుకొలిపేదే అరుణ. "ప" నుండి "మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని". జయమును కలుగ చేయునది. అలాగే అగ్ని ఖండంలోని " య, ర,ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి". శాశించే శక్తి కలది సర్వేశ్వరి. ఆఖురులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష లకు అధిదేవత "కౌలిని" ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము. మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లను అర్చిస్తున్నాయి. కాబట్టి మనం స్తోత్రం చదువు తున్నా, వేద మంత్రాలు, సూక్తాలు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు. మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. మనం చేసే శబ్దమే ఆ దేవత. మన అంతశ్చేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం. ఇది సనాతన ధర్మం. *ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.* సేకరణ మాత్రమే

 
 
Design by The Colour Moon